Sunday, January 19, 2025

బాబు నీచ చరిత్రను భువనేశ్వరి మరచిపోయారా?: లక్ష్మీ పార్వతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: అవినీతి చంద్రబాబు నాయుడును నీతిపరుడుగా చూపేయత్నం మానుకోవాలని టిడిపి నేతలకు వైసిపి నేత లక్ష్మీ పార్వతి హితువు పలికారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు సందర్భంగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీచ చరిత్రను భువనేశ్వరి మరచిపోయారా? అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు చేసింది పెద్ద అవినీతేనని, బాబు అవినీతి కేసులపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని లక్ష్మీ పార్వతి అడిగారు. నీతి మంతుడైతే విచారణ ఎదుర్కోవాలని కదా? అని చురకలంటించారు. చంద్రబాబు దోచిన డబ్బంతా విదేశాల్లో పెట్టుబడి పెట్టారని లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అవినీతిపరులకు మద్దతుగా నిలవమని భువనేశ్వరి ఏ రకంగా కోరుతారని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News