సిటిబ్యూరోః ప్రీ లాంచ్ పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఫ్లాట్‌ను ఇవ్వకుండా మోసం చేసిన భువన తేజ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…గచ్చిబౌలి, నానక్‌రాంగూడ,జయభేరీ ఆరెంజ్ కంట్రీలో ఉంటున్న చెక్క వెంకట సుబ్రమణ్యం భువన తేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిట్ డైరెక్టర్. నిందితుడు పలువురి వద్ద ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. కానీ అపార్ట్‌మెంట్ కట్టకుండా ఫ్లాట్‌లు కేటాయించకుండా మోసం చేశాడు.
ఈ క్రమంలోనే శామీర్‌పేటలోని హ్యాపీ హోమ్స్ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించాడు. దాని పేరుతో చెప్పి దాదాపుగా 400మంది బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల నుంచి రూ.2.29కోట్లు వసూలు చేశాడు. ఫ్లాట్స్ ఇవ్వకుండా, డబ్బులు తిరిగి ఇవ్వలేదు, ఎన్నిసార్లు అడిగినా కూడా దాటవేయడంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.