Monday, January 20, 2025

ఎల్‌బినగర్‌లో పోలీసుల పక్షపాత ధోరణి

- Advertisement -
- Advertisement -

సీఈఓ వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసిన మధుయాష్కీగౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో పోలీసులు తనకు అటంకాలు కల్గిస్తూ ఇతర పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వికాస్‌రాజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటిపై అర్థరాత్రి పోలీసుల దాడి చేశారని, కనీసం వారెంట్ లేకుండా అర్థరాత్రి ఇళ్లు, ఆఫీస్‌పై దాడి చేసి భయబ్రాoతులకు గురిచేశారని తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ అధికారి అయినా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే పనిచేయాలని, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి ఫి ర్యాధు చేసినా పట్టించుకోలేదన్నారు. తాను మాజీ ఎంపిని, నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని సోదాలు చేసినా వనస్థలిపురం ఎసిపి భీమ్‌రెడ్డి, హయత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసంఘటనై కేంద్ర ఎన్నికల సంఘం, డీజీపీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News