Monday, December 23, 2024

అరెస్టును సవాల్ చేసిన బిభవ్ కుమార్..స్వాతి మాలివాల్‌పై దౌర్జన్యం కేసు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో ఈ నెల ప్రథమార్ధంలో ఆప్ ఎంపి స్వాతి మాలివాల్‌పై దౌర్జన్యం ఆరోపణ సందర్భంగా తన అరెస్టును సవాల్ చేస్తూ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ సన్నిహిత సహాయకుడు బిభవ్ కుమార్ బుధవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 41ఎ నిబంధనల ఉల్లంఘన అని, చట్టానికి వ్యతిరేకమని ప్రకటించవలసిందని బిభవ్ కుమార్ తన పిటిషన్‌లో కోరారు. తన ‘అక్రమ’ అరెస్టుకు ‘సముచిత పరిహారం’ ఇవ్వాలని, తన అరెస్టు నిర్ణయంలో ప్రమేయం ఉన్న దోషులైన అధికారులపై శాఖానుగత చర్య తీసుకోవాలని కూడా ఆయన కోరారు.

బిభవ్ కుమార్ బెయిల్ అభ్యర్థనను ఢిల్లీలోని ఒక సెషన్స్ కోర్టు సోమవారం తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్ దాఖలులో మాలివాల్ ‘ముందస్తు ప్రమేయం’ ఉన్నట్లు కనిపించడం లేదని, ఆమె ఆరోపణలను ‘తోసిరాజనలేం’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 13న సిఎం అధికార నివాసంలో తనపై బిభవ్ కుమార్ దౌర్జన్యం చేశారని రాజ్యసభ ఎంపి స్వాతి మాలివాల్ ఆరోపించారు. కుమార్‌ను ఈ నెల 18న అరెస్టు చేశారు. ఒక మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు కుమార్‌ను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News