Monday, December 23, 2024

జీతాలు రాక జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో (విఆర్‌ఎ) జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బస్వాపూర్ గ్రామానికి చెందిన మార్కంటి శ్రీకాంత్(27) విఆర్‌ఎగా విధులు నిర్వహించేవాడు. గత ప్రభుత్వం విఆర్‌ఎలలో ఉన్న విద్యవంతులను జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. దీంతో బీబీపేట తహసీల్దారు కార్యాలయంలో శ్రీకాంత్ పని చేస్తున్నాడు.

గత ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. మండల ఆఫీస్‌కు వచ్చిన శ్రీకాంత్ సహోద్యోగులకు బయటకు వెళ్తున్నానని చెప్పాడు. బీబీపేట చెరువు సమీపంలో అతడి ద్విచక్రవాహనం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం బయటపడడంతో కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అతడి అన్న గణేశ్ రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు నమోసుకున్నట్టు తెలిపారు. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News