Wednesday, January 22, 2025

సిస్టర్ సెంటిమెంట్‌తో…

- Advertisement -
- Advertisement -

2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’తో వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ”బిచ్చగాడు మూవీ తర్వాత మరో బిగ్ బ్లాక్‌బస్టర్ వస్తోంది. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు”అని అన్నారు.

నిర్మాత ఫాతిమా ఆంటోనీ మాట్లాడుతూ.. “బిచ్చగాడు సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. బిచ్చగాడు 2 మూవీ అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది”అని చెప్పారు. తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ “ఏపి, తెలంగాణలో ఫస్ట్ టైమ్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ చిత్రం మే 19న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది”అని చెప్పారు. ఈ కార్యక్రంలో హీరోయిన్ కావ్య థాపర్, చదలవాడ శ్రీనివాసరావు, ఆర్ నారాయణమూర్తి, జాన్, భాష్యశ్రీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News