విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనీకి జోడిగా ఈ సినిమాలో కావ్యా థాపర్ నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా మే 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్, ఆకాష్ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో
Also Read: `24/7 ఒకటే ధ్యాస` సాంగ్ లాంఛ్ చేసిన విశ్వక్‌సేన్
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మనమే కథలు రాస్తున్నాం.. మనమే సినిమాలు చేస్తున్నామని అని అనుకున్నాను. కానీ విజయ్ గారు మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని విజయ్ సర్ ఫోన్ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో ఐదు డిఫరెంట్ సిటీల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఉషా పిక్చర్స్ నాయుడు గారికి థాంక్స్. సురేష్ గారు నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా ఉన్నారు. బిచ్చగాడు సినిమాలో నెంబర్ ప్లేట్ సీన్ నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ప్రాణం పెట్టి అందరూ చెబుతుంటారు. కానీ ఫాతిమా గారు, విజయ్ గారు నిజంగానే ప్రాణం పెట్టారు. కావ్య తెలుగులో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు సినిమా టైటిల్ వినగానే ఇదేం టైటిల్ అనుకున్నా. కానీ ఆ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. చిన్న సినిమాలకు బిచ్చగాడు ఫ్లాట్‌ఫాంలా మారింది. ఈ సినిమా ఎంతో మందికి కాన్ఫిడెంట్ ఇచ్చింది. విజయ్ ఆంటోని ని ఇంత వరకు ప్రేమిస్తూ వచ్చాను. కానీ ఆయన్ను కలిశాక గౌరవించడం ప్రారంభించాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read: హీరో అడివి శేష్‌ను అభినందించిన రామ్‌నాథ్ కోవింద్
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి థాంక్స్. అడివి శేష్ గారి గూఢచారి చిత్రం తీయడం ఎంతో కష్టం. ఆయనతో కలిసి ఇలా స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉంది. కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ పూరి జగన్నాథ్ గారు అద్భుతంగా తీస్తుంటారు. ఆయన కొడుకు ఆకాష్ పూరిని ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న వీరమనాయుడు, విజయ్ గారికి థాంక్స్. పెళ్లి చేసి అమ్మాయిని మెట్టింటికి పంపిస్తుంటే.. తండ్రి బాధపడుతుంటాడు. ప్రతీ సినిమా విషయంలో మేం కూడా భయపడుతుంటారు.
కానీ మా డిస్ట్రిబ్యూటర్లు వీరమనాయుడు, ఉషా పిక్చర్స్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నాకు ఎలాంటి భయం లేదు. భాషా శ్రీ గౌరవ్ గారు నా ఆలోచనలన్నీ తెలుగులో చక్కగా చెబుతుంటారు. నన్ను ప్రమాదం నుంచి కాపాడిన కావ్యకు థాంక్స్. నా తప్పు వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. అన్ని రకాలుగా ఎంతో అండగా ఉంటున్న నా భార్య ఫాతిమాకు థాంక్స్. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. బిచ్చగాడు మొదటి పార్ట్ నచ్చిన అందరికీ కూడా రెండో పార్ట్ నచ్చుతుంది. మే 19న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.
Also Read: ‘స్పై’ చిత్రం సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కాదు: నిఖిల్ సిద్ధార్థ్
ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘విజయ్ ఆంటోనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ వస్తుంది. బిచ్చగాడు సినిమాను పెద్ద హిట్ చేశారు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. నకిలీ సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. వీరనాయుడు మాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఉషా పిక్చర్స్, వీరమనాయుడు కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన విజయ్ ఆంటోనీయే చూసుకున్నారు.
సంక్రాంతి రోజు మలేషియాలో షూటింగ్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని మేనేజర్ కాల్ చేసి మాట్లాడారు. మేడం యాక్సిడెంట్ అయింది.. సర్‌కి స్పృహ కూడా లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా నుంచి అభిమానుల ప్రేమ నాకు అందింది. ఆయన తిరిగి వస్తారనే నమ్మకాన్ని అభిమానులు నాకు ఇచ్చారు. అభిమానుల ప్రేమ వల్లే మేం ఇలా బతికి ఉన్నాం. బాధలన్నీ తొలిగిపోయాయ్ ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతోంది. అంతా సంతోషంగా ఉంది. ఇంత గొప్పగా ఈవెంట్‌ను ప్లాన్ చేసినందుకు థాంక్స్. మే 19న థియేటర్లోనే ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
Also Read: ప్రేక్షకుల స్పందన లేకనే “ కేరళ స్టోరీ ” ఆగింది…
డిస్ట్రిబ్యూటర్ విజయ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న బాలకృష్ణ గారు ఇప్పటికీ కళామతల్లిని నమ్ముకుని ఉన్నారు. ఈ 49 ఏళ్లలో 2200 పైచిలుకు సినిమాలు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లకు ఎక్కారు. ఎంతో మంది అండతో ఈ స్థాయికి మేం ఎదగగలిగాం. మాకు సహకరించిన అందరికీ థాంక్స్. 1995లో విజయ్ ఆంటోనీ గారు ఓ బాయ్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత టెక్నీషియన్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్స్ ఇచ్చారు. హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే హేళన చేసేవారట. కానీ ఆయన ఇప్పుడు ఎంతో పెద్ద హీరో అయ్యారు. మా మీద నమ్మకంతో బిచ్చగాడు 2 సినిమాను మాకు ఇచ్చిన విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
కావ్యా థాపర్ మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు 2 సినిమా మే 19న రాబోతోంది. విజయ్ గారు ఎంతో నొప్పిని భరిస్తూ కూడా పాట పాడారు. ఆయన కోసమే వచ్చి డ్యాన్స్ చేశాను. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ప్రతీ సీన్‌లోనూ ఎంతో నేర్చుకున్నాను. ఆయన నాకు ఓ మంచి స్నేహితుడు. హేమ పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. ఫాతిమా మేడం, విజయ్ సర్‌కు థాంక్స్’ అని అన్నారు.
లిరిక్ రైటర్ భాషా శ్రీ మాట్లాడుతూ.. ‘2016లో బిచ్చగాడు రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగులో రికార్డులు బద్దలు చేసింది. బిచ్చగాడు 2 మీరు ఊహించిన దాని కంటే పది రెట్లు ఉంటుంది. మొదటి పార్ట్‌కు మాటలు, పాటలు రాశాను. ఈ రెండో పార్ట్‌కూ రాశాను. త్వరలో మూడో పార్ట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.
Also Read: ‘మేమ్ ఫేమస్’ నుంచి థర్డ్ సింగిల్ ‘దోస్తులం’