- Advertisement -
వాషింగ్టన్: ఇంటా బయటి నుంచి వస్తున్న ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు తలొగ్గారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.
కొంతకాలంగా బైడెన్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార వేదికల్లో పలు మార్లు తడిబడిన వైనం బహిర్గతమైంది. ట్రంప్‌తో ముఖాముఖి చర్చలోనూ బైడెన్ చాలా వెనకబడ్డారు. ఈ నేపథ్యం లో పార్టీతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం బైడెన్ తప్పుకోవాలని సూచించారు.
- Advertisement -