వాషింగ్టన్: హమాస్ ఉగ్ర దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం వైట్ హౌస్ నుంచి బయల్దేరారు. అయితే గాజాలోని ఒక ఆసుపత్రిలో భారీ విస్ఫటం సంభవించి వందలాది మంది మరణిచిన దరిమిలా జోర్డాన్, ఈజిప్టు, పాలస్తీనా నాయకులతో జరగవలసి ఉన్న సమావేశాన్ని పాలస్తీనా పాలకులు రద్దు చేయడంతో బైడెన్ తన జోర్డాన్ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన ఇజ్రాయెల్ ్సందర్శనకే పరిమితమవుతారు.
గాజాలోని అల్ అహ్లి అరబ్ ఆసుపత్రి వద్ద భారీ పేలుడు సంభవించి వందలాది మంది పౌరులు మరణించారు. ఈ బాంబు దాడితో తమకు ప్రమేయం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే పాలస్తీనా మాత్రం ఈ దాడికి ఇజ్రాయెలీ కారణమని ఆరోపిస్తోంది.
గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆసుపత్రి వద్ద జరిగిన భారీ పేలుడు పట్ల బైడెన్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే తాను జోర్డాన్‌రాజు అబ్దుల్లా 2, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడానని ఆయన తెలిపారు.
అక్కడ అసలు ఏమి జరిగిందో సూర్తి సమాచారం సేకరించవలసిందిగా తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించానని ఆయన తెలిపారు. యుద్ధ వాతావరణంలో పౌరుల ప్రాణాల రక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందని, ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడులో రో మరణించిన రోగులు, వైద్య సిబ్బంది, అమాయక ప్రజలకు తాము సంతాపం ప్రకటిస్తున్నామని బైడెన్ తెలిపారు.