Thursday, December 19, 2024

జిల్‌కు గ్రీన్ డైమండ్.. బైడెన్‌కు ‘సహస్ర చంద్రులు’

- Advertisement -
- Advertisement -

జిల్‌కు గ్రీన్ డైమండ్.. బైడెన్‌కు ‘సహస్ర చంద్రులు’
అమెరికా అధ్యక్ష దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు
మోడీకి బైడెన్ దంపతుల అత్మీయ విందు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్యంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మోడీకి బుధవారం అమెరికా అధ్యక్ష భవనంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీని బైడెన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సరదాగా కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలను ఇరువురు నేతలు చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ట్వీట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు గంధపు చెక్కతో చేసిన ఓప్రత్యేక బాక్స్‌ను అందించగా, ప్రథమ మహిళ జిల్‌కు మాత్రం ప్రత్యేకమైన గ్రీన్ డైమండ్‌ను కానుకగా ఇచ్చారు. ఈ 7.5 క్యారెట ్లగ్రీన్ డైమండ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్‌లో తయారు చేశారు. ఒక క్యారెట్ వజ్రాన్ని తయారు చేయడానికి 0.028గ్రాముల కార్బన్ మాత్రమే విడుదలవుతుంది. దీన్ని జెమొలాజికల్ ల్యాబ్ కూడా ధ్రువీకకరించింది. వజ్రానికి ఉండే నాలుగు ప్రధాన లక్షణాలైన కట్, కలర్,క్యారెట్, క్లారిటీలను ఇది కలిగి ఉంటుంది. భూమిలో లభించే సహజమైన వజ్రం మాదిరిగానే దీనికి రసాయన, ఆప్టికల్ లక్షణాలు ఉంటాయి. దీని తయారీలో సౌర, పవన శక్తి వనరులను ఉపయోగించినందున ఇది పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని ఉంచిన చిన్న బాక్సును కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. కాగితం గుజ్జుతో చేసిన ఈ బాక్స్‌పై కశ్మీరీ కళాకారులు వివిధ డిజైన్లను వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News