Sunday, December 22, 2024

ఢిల్లీ జి 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజర్‌పై బైడెన్ అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: న్యూఢిల్లీలో ఈ వారంలో జరిగే జి 20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోవడంపై అమెరికా అద్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అందుతున్న వార్తల ప్రకారం చైనా ప్రధాని లీ జియాంగ్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరిగే జి 20 సదస్సుకు హాజరవుతారు. కాగా.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మాత్రం జి 20 సదస్సులో పాల్గొనకపోవడంపై జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాను మాత్రం ఆయనను కలుసుకుంటున్నానని బైడెన్ ఆదివారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ఇతర వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. రెండు దేశాల అధ్యక్షులు చివరిసారి 2022లో ఇండోనేషియా బాలిలో జరిగిన జి 20 సదస్సులో కలుసుకున్నారు.

ఢిల్లీలో జరిగే జి 20 సదస్సుకు తాను వెళుతున్నట్లు గతంలో జీ జిన్‌పింగ్ తెలిపారు. ఆగస్టు 31న జరిగిన విలేకరుల సమావేశంలో చైనా విదేశాంత మంత్రిత్వశాఖ మాత్రం జిన్‌పింగ్ భారత పర్యటనపై ఎటువంటి వివరాలు తెలియచేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News