వాషింగ్టన్ : హెచ్ 1 బి వీసా గ్రీన్ కార్డులు సత్వరం జారీ అయ్యేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చొరవ తీసుకోనున్నారని , శ్వేతభవనం ప్రకటించింది. దీనివల్ల హెచ్ 1 బి వీసాలపై అమెరికాలో ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది.గ్రీన్ కార్డు అంటే అమెరికాలో వలస ప్రజల శాశ్వత నివాసానికి అనుమతించే అధికారిక పత్రిం అని తెలిసిందే. భారతీయ ఐటి ఉద్యోగులు చాలామంది అత్యంత నైపుణ్యం కలిగి ఉండడమే కాకుండా ముఖ్యంగా హెచ్ 1 బి వీసాలపైనే పనిచేయడానికే అమెరికా వస్తుంటారు. అయితే ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం ఒక్కో దేశానికి 7 శాతం వరకే గ్రీన్ కార్డుల కోటా కేటాయిస్తున్నారు. అక్టోబర్ 1 నాటికి దాదాపు 80 వేల గ్రీన్ కార్డులు నిరుపయోగంగా ఉన్నాయన్న ప్రశ్నకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ సమాధానం ఇస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.
గ్రీన్‌కార్డుల సత్వర జారీకి బైడెన్ చొరవ
- Advertisement -
- Advertisement -
- Advertisement -