Monday, December 23, 2024

గే మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : స్వలింగ సంపర్కుల వివాహం ( గే మ్యారేజి ) కు చట్టబద్ధత కల్పించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం సంతకం చేయనున్నారు. ఈమేరకు వైట్‌హౌస్‌లో సంబరాలు జరుపుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేలాది మందిని ఆహ్వానించారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వైట్‌హౌస్‌లో సంగీత కార్యక్రమం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

కొలరాడోకు చెందిన క్లబ్ క్యూ ఓనర్ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. 2015లో ఒబెర్‌జెఫెల్ వి. హోడ్జెస్ కేసు విషయంలో గేమ్యారేజికి ఆమోదం లభించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని తారుమారు చేయకుండా ఉంటే గే మ్యారేజికి రక్షణ లభిస్తుంది. ఈ బిల్లు అంతరజాతుల వివాహానికి కూడా రక్షణ కల్పిస్తుంది. అంతరజాతుల వివాహాన్ని 16 రాష్ట్రాలు నిషేధించే చట్టాలను 1967లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. గత వారం ఈ చట్టం ఆమోదం పొందినప్పుడు మిలియన్ వివాహాలకు దీనివల్ల రక్షణ కలుగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News