మద్ధతు తెలిపిన బైడెన్
వాషింగ్టన్ : పునర్వస్థీకృత భద్రతా మండలిలో జర్మనీ, జపాన్, భారతదేశానికి శాశ్వత సభ్యత్వం వాదనకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారవర్గాలు గురువారం తెలిపాయి. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, జపాన్, జర్మనీలకు ఈ స్థానం కల్పించాల్సి ఉంది. అయితే ఈ అంశంపై మరింత క్షుణ్ణంగా పరిశీలన జరగాల్సి ఉందన్నారు. అన్నీ పరిశీలించుకుని ఈ దేశాలకు శాశ్వత సభ్యత్వం అవకాశం ఇస్తే మంచిదని బైడెన్ సూచించారు. భద్రతా మండలిలో పూర్తి స్థాయి మార్పులకు అమెరికా కట్టుబడి ఉంటుందని కూడా అంతకు ముందు బైడెన్ ఐరాస భేటీని ఉద్ధేశించి తెలిపారు. మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యత్వ దేశాల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఇప్పటి పరిస్థితులలో ఎంతైనా ఉందని అమెరికా తరచూ చెపుతోందని అన్నారు.