Wednesday, January 15, 2025

సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీతో బైడెన్ భేటీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: జి 20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొంటారని వైట్ హౌస్ శనివారం ప్రకటించింది.

సెప్టెంబర్ 9, 10 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే జి 20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ నాయకులకు జి 20 భారత్ ఆతిథ్య మివ్వనున్నది.

వచ్చే గురువారం(సెప్టెంబర్ 7) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పయనమవుతారని వైట్ హౌస్ తెలిపింది. సెప్టెంబర్ 8న భారత ప్రధాని నరేంద్ర మోడీతో బైడెన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని తెలిపింది. 9,10 తేదీలలో అధ్యక్షుడు జి 20 సదస్సులో పాల్గొంటారని, ప్రపంచం ముందున్న సవాళ్లు, సమస్యలను జంయుక్తంగా ఎదుర్కోవడంపై ప్రపంచ నాయకులతో బైడెన్ చర్చలు జరుపుతారని వైట్ హౌస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News