Monday, December 23, 2024

వచ్చేనెలలో బైడెన్ భారత్ పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారతదేశంలో పర్యటిస్తారు. సెప్టెంబర్‌లో ఇండియాలో జరిగే జి 20 సమ్మిట్‌కు హాజరు అవుతారు. అమెరికా అధ్యక్షులు అయిన తరువాత బైడెన్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి అవుతుంది. బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ భారతదేశంలో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రెటరీ కారినే జిన్ పియిరీ ఓ ప్రకటన వెలువరించారు. జి 20 లీడర్స్ సదస్సుకు బైడెన్ హాజరుకానున్నట్లు తెలిపారు.

జి 20కి భారతదేశం ఆతిధ్యం ఇస్తోంది. ఈ సమ్మిట్ దశలో బైడెన్ పలువురు నేతలతో ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన పరిణామం, వాతావరణ మార్పుల సంక్లిష్టతలపై విశ్లేషిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్పలితాలపై ఈ వేదిక సందర్భంగా సరైన విధంగా నిరసన వ్యక్తం చేసేందుకు బైడెన్ సంకల్పించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News