Tuesday, January 21, 2025

పుతిన్ ‘అణు బెదిరింపులు’ జోక్ కాదు: బైడెన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Biden supports India as permanent members of reformed UNSC

న్యూయార్క్: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా కొద్ది వారాల్లోనే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని భావించినప్పటికీ అది సాధ్యం కాకపోగా, ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు సందర్భాల్లో అణుబాంబుల అంశాన్ని తెరపైకి తెచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు గనుక జోకం చేసుకుంటే అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు కూడా. కాగా పుతిన్ అణు హెచ్చరికలు జోక్ కాదని , అణు బాంబులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు ముప్పును చూడలేదని పేర్కొన్నారు. మన్‌హట్టన్‌లో గురువారం నిర్వహించిన డెమోక్రటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనే లక్షంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న అణు బెదిరింపులు ఏమాత్రం జోక్ కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తొలిసారి అమెరికా ప్రత్యక్షంగా అణుదాడి ముప్పును ఎదుర్కొంటుందని బైడెన్ పేర్కొన్నారు. అణు దాడిపై బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఉక్రెయిన్ విలీన భూభాగాలను కాపాడుకోవడానికి అన్ని దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం టాక్టికల్ అణ్వాయుధాలను దృష్టిలో ఉంచుకుని చేసిన హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇటువంటి అణ్వాయుధాలు కూడా తీవ్రస్థాయి సంక్షోభానికి కారణమవుతాయని బైడెన్ హెచ్చరించారు. ‘ పుతిన్ జోక్ చేయడంలేదు. టాక్టికల్ అణ్వాయుధాలు, లేదా జీవాయుధాలు లేదా రసాయనిక ఆయుధాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారి సైన్యం ఆశించిన స్థాయిలో పోరాడడం లేదు. ఇది కేవలం అణ్వాయుధ వినియోగంతోనే ముగియదు. పుతిన్‌ను ఆ మార్గం నుంచి ఎలా తప్పించాలనే దానిపై మేము కసరత్తు చేస్తున్నాం. కేవలం పుతిన్‌ను ఆ స్థానం నుంచి తప్పించడమే కాదు..అతడ్ని ఓడించడం, రష్యాలో అతడ్ని బలహీనపర్చడంపై కూడా పని చేస్తున్నాం’ అని బైడెన్ పేర్కొన్నారు.

Biden warns Putin Nuclear Threats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News