వైట్‌హౌస్ అధికారిక వివరణ ..
హక్కుల స్వేచ్ఛపై భారత్ ఆలోచించాలి
అమెరికా దీనిపై నిర్ణేత కాబోదు
వాషింగ్టన్ : అమెరికా పర్యటన దశలో ప్రధాని మోడీకి తమ దేశ అధ్యక్షలు బైడెన్ మానవ హక్కులపై ఉపదేశాలు, లెక్చర్లు ఇచ్చే ప్రసక్తే లేదని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు, మైనార్టీల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ప్రధాని మోడీతో బైడెన్ ప్రస్తావించాల్సి ఉందని అమెరికాకు చెందిన హక్కులు, మతస్వేచ్ఛల సంస్థలు కొన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కొందరు చట్టసభ సభ్యులు కూడా తమ ప్రకటనలలో మోడీని ఈ విషయంలో దీని గురించి ప్రస్తావించాల్సి ఉందని తెలిపాయి.
అయితే ఇటువంటిదేమీ ఉండదని అధ్యక్ష భవనం శ్వేతసౌథం నుంచి కీలక ప్రకటన వెలువరించారు. ప్రధాని మోడీ ఈ విషయం గురించి బైడెన్ ఎటువంటి ఉపదేశం ఇచ్చే ప్రసక్తే లేదని ఇందులో తెలిపారు. పత్రికా స్వేచ్ఛ, మతస్వేచ్ఛ ఇతర విషయాల విషయానికి వస్తే వీటిపై అమెరికా తరఫున కేవలం అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది తప్పితే దీనిని సందేశంగా లెక్చర్‌గా భావించాల్సిన అవరం లేదని వైట్‌హౌస్ తెలిపింది. భారత్‌లో వ్యవస్థలు, రాజకీయాలు ఎటువెళ్లుతాయనేది చెప్పడానికి తాము సిద్ధంగా లేరని, దీనిపై తేల్చుకోవల్సింది కేవలం భారతీయులు, అక్కడి పౌరులే అని స్పష్టం చేశారు.
భారత్‌లో వ్యవస్థల పయనం ఏమిటనేది తేల్చాల్సింది అమెరికా కాదని తెలిపారు. భారత్‌లోని విషయాలను అమెరికా ఖరారు చేసే వీలుండదని, అవి ఆ దేశ అంతర్గత విషయాలని వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ భద్రతా సలహదారు జేక్ సల్లీవాన్ తెలిపారు. అమెరికా విధానంలో హక్కుల రక్షణ, మత స్వేచ్ఛ , మత స్వేచ్ఛ, బహుళత్వం, మీడియా భద్రత కీలకం అని, దీనిని అమెరికా కీలకంగా భావిస్తుంది. ఇదే దశలో మిత్రదేశాలు కూడా ఈ విధానం పాటించాలనే సూచిస్తామని, అంతకు మించి ఉపదేశ స్థాయికి వెళ్లడం కుదరదని వైట్‌హౌజ్ ప్రతినిధి తెలిపారు. చైనాకు చెక్‌పెట్టడంపై భారతదేశ ప్రధానితో చర్చిస్తారా? అనే విషయంపై ఈ ప్రతినిధి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
ఇది భారతదేశం, అమెరికా సంబంధిత విషయాలపై జరిగే చర్చల క్రమపు పర్యటన అని, ఇందులో ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనాకు కళ్లెం వంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయా? అనేది చెప్పలేమని తెలిపారు. అయితే సైన్యం , సాంకేతిక, ఆర్థికవ్యవస్థలు వంటి విషయాలలో ఇప్పుడు చైనా సాగిస్తున్న వ్యవహారశైలి గురించి అనివార్యంగా ప్రస్తావనకు వస్తుందన్నారు. దీనిని చైనాకు చెక్‌పెట్టే విషయంపై భారత ప్రధానితో చర్చగా భావించడానికి వీల్లేదన్నారు. చైనా దూకుడును నివారించేందుకు భారత్‌ను తమ అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశంగా మలుచుకునేందుకే బైడెన్ ప్రధాని మోడీతో చర్చల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎదుగుతున్న భారత్ పట్ల వినూత్న వ్యూహాత్మక వైఖరితో వ్యవహరించాల్సి ఉందని ఇటీవలే అమెరికాకు చెందిన పలువురు ఎంపిలు బైడెన్‌కు లేఖలు రాశారు. ఇదేదశలో భారత్‌ను హక్కుల విషయంలో నిలదీయాల్సిందేనని పలు సంస్థలు తెలిపాయి.