వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్ కాంగ్రెస్‌ను, అమెరికన్ ప్రజలనుద్దేశించి మార్చి 1వ తేదీన మొట్టమొదటిసారి ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించాలని ఆహ్వానిస్తూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు వైట్ హౌస్ శుక్రవారం ధ్రువీకరించింది. అమెరికన్ అధ్యక్షుడు ప్రతి సంవత్సరం జనవరిలో స్టేట్ ఆఫ్ ది యూనియన్(కాంగ్రెస్)ను ఉద్దేశించి ప్రసంగించడం సాంప్రదాయం. అయితే ఇటీవల కాలంలో బైడెన్ చేయనున్న తొలి ప్రసంగం ఇదే కానున్నది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో ఈ ప్రసంగం ఉంటుంది. అయితే కొవిడ్ కేసులు శీతాకాలంలో పెరిగిపోవడం, వింటర్ ఒలింపిక్స్ ఉన్న కారణంగా దీన్ని మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. చివరిసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్‌లో తన తొలి అభిశంసన విచారణ పూర్తయిన తర్వాత స్టే ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చశారు.
మార్చి 1న బైడెన్ తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం
- Advertisement -
- Advertisement -
- Advertisement -