Monday, December 23, 2024

బైడెన్ మనవరాలి సెక్యూరిటీ గార్డు కాల్పులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బైడెన్ మనవరాలి సెక్యూరిటీ గార్డు ఒకరు వాషింగ్టన్‌లో దుండగులపై కాల్పులు జరిపారు. జార్జిటౌన్ ఏరియాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ దశలో అక్కడ బైడెన్ మనవరాలు 29 ఏండ్ల నవోమి బైడెన్ అక్కడ ఉన్నారా? లేదా అనేది వెల్లడికాలేదు.

ప్రభుత్వ స్టిక్కర్‌తో ఉన్న ఈ కారు ఆగి ఉండగా దుండగులు అద్దాలు పగులగొట్టేందుకు యత్నించినట్లు గుర్తించడంతో సీక్రెట్ సర్వీస్‌కు చెందిన ఏజెంట్లు గమనించి కాల్పులు జరిపినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దుండగులు తప్పించుకున్నారు. ఆగంతకులతో ఎవరికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు అని నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News