Monday, December 23, 2024

వివాహవేదిక అయిన వైట్‌హౌస్

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం వివాహ వేదిక అయ్యింది. దేశాధ్యక్షులు జో బైడెన్ మనవరాలు నవోమి బైడన్ పెళ్లికూతురు అయింది. ఇక్కడ విశిష్ట రీతిలో జరిగిన వేడుకలో నవొమి బైడెన్ పెద్దల సమక్షంలో పీటర్ నియాల్‌ను పెళ్లాడింది. వైట్‌హౌస్‌లో జరిగిన 19వ వివాహ వేడుకగా ఈ పెళ్లి చరిత్రలోకి చేరుకుంది. దేశాధ్యక్షల మనవరాలి పెళ్లి వైట్‌హౌస్ ఆవరణలో జరగడం ఇదే తొలిసారి. తీవ్రస్థాయి శీతలగాలులు, పడిపోయిన ఉష్ణోగ్రతల నడుమ వైట్‌హౌస్ సౌత్‌లాన్స్‌లో అతి కొద్ది మంది బంధువులు, కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు రాగా పరస్పర బాసల నడుమ అమెరికన్ల పద్ధతి ప్రకారం రింగ్‌లు అమర్చుకోవడం ద్వారా వీరు జంట అయ్యారు.

దేశ ప్రధమ పౌరుడు బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్, కుటుంబానికి చెందిన వధువు పొడవాటి తెల్లటి గౌన్, మేలిముసుగు ధరించి, చేతుల్లో తెల్లటి లిల్లీ పూల గుచ్ఛంతో వరుడి వెంట నడిచింది. మతపెద్దలు చెప్పిన దానికి వీరిరువురు అంగీకారం తెలియచేయడం ద్వారా వివాహం ముగిసింది. సూర్యుడు బాగా వెలుతురు కురిపిస్తూ తన ఉనికి చాటుకున్నా, ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల స్థాయిలో ఉండటంతో చల్లదనంలో వెచ్చదనం నడుమ వివాహఘట్టం సాగింది. ఆహుతులకు తెల్లటి కుర్చీలు అమర్చారు. నయోమీ , పీటర్ మధ్య చాలాకాలంగా ప్రేమాయణం సాగింది. చివరికి వీరు ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. నవోమి, పీటర్‌లు ఇద్దరూ లా డిగ్రీ పూర్తి చేశారు. చాలా కాలం క్రితమే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. తాము వైట్‌హౌస్ ఆవరణలోనే పెళ్లి చేసుకుంటామని వీరు ప్రకటించడంతో ఇందుకు అనుగుణంగానే వీరి పెళ్లి జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News