Monday, January 20, 2025

తొలి రోజే రూ.1.45 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

Bids to the tune of Rs 1.45 lakh crore in 5G spectrum auction

5జి వేలానికి భారీ డిమాండ్
2015తో పోలిస్తే ఇది రికార్డు స్థాయి
పోటీలో దిగ్గజ టెలికాం సంస్థలు

న్యూఢిల్లీ : మొబైల్ సిగ్నల్ కోసం ఉపయోగించే దేశీయ అతిపెద్ద స్పెక్ట్రమ్(5జి) వేలం తొలి రోజు దిగ్గజ వ్యాపార వేత్తలు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, గౌతమ్ అదానీలకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. మంగళవారం మొదటి రోజు 5జి స్పెక్ట్రమ్ వేలంలో రూ.1.45 లక్షల కోట్ల మేరకు బిడ్‌లు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మిట్టల్‌కు చెందిన భారతీయ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, అదానీ గ్రూప్‌నకు చెందిన ‘యాక్టివ్‌లీ’ వంటి సంస్థలు ఈ 5జి స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. 4జి కంటే 10 రెట్లు ఎక్కువ వేగాన్ని కల్గిన 5జి స్పెక్ట్రమ్ కోట్లాది డివైజ్‌లకు కనెక్ట్ చేయవచ్చు. టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, 700 మెగాహెర్ట్ బ్యాండ్‌కు కూడా బిడ్‌లను అందుకున్నామని అన్నారు. మొదటి రోజే వేలంలో బిడ్‌లు రూ.1.45 లక్షల కోట్లు దాటాయని, ఇది 2015 రికార్డులను అధిగమించిందని ఆయన అన్నారు.

అయితే ఏ కంపెనీ ఎంత మేరకు ఎయిర్‌వేవ్స్‌ను సొంతం చేసుకుందనే గణాంకాలు ఇంకా తెలియరాలేదు. డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్‌ల జాబితా ప్రకారం, రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్స్ శాఖలో ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌గా రూ. 14,000 కోట్లు డిపాజిట్ చేసింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.5,500 కోట్లు డిపాజిట్ చేసింది. ఇక వొడాఫోన్ ఐడియా రూ.2200 కోట్లు డిపాజిట్ చేసింది. అదానీ డేటా నెట్‌వర్క్ కేవలం రూ.100 కోట్లు డిపాజిట్ చేసింది. వేలంలో ఏ కంపెనీకి 5జి స్పెక్ట్రమ్ లభిస్తుందో వారికి 20 ఏళ్లపాటు 5జి స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097 మెగాహెరట్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News