Wednesday, January 22, 2025

అభిమానుల బారినుంచి బతికి బయటపడిన బిగ్ బాస్ నటి అశ్వని శ్రీ (వీడియో)

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఎంత ఘనంగా జరిగిందో, షో ముగిశాక, జరిగిన పరిణామాలు మాత్రం కలవరం కలిగించేవిగా ఉన్నాయి. విజేతను ప్రకటించాక, అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అల్లర్లకు దిగిన అభిమానులు అనేక కార్లను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ కేసులో విజేత పల్లవి ప్రశాంత్ తోపాటు, అతని సోదరుడు, ఇతరులు కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే.

Big Boss actress Ashwini Sri survived the clutches of her fansవైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ లోకి ప్రవేశించిన నటి అశ్వని శ్రీకి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అశ్వని స్వయంగా పోస్ట్ చేయడం విశేషం. అభిమానం శ్రుతి మించితే ఎంత ప్రమాదమో ఈ వీడియో తెలియజేస్తోంది. పోటీ ముగిసిన అనంతరం బయల్దేరిన అశ్వని కారును అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో అశ్వని స్వయంగా కారును నడుపుతున్నారు.

Big Boss actress Ashwini Sri survived the clutches of her fansఆమె కారును ముందుకు కదలనివ్వకుండా అభిమానులు చుట్టుముట్టి, సెల్ ఫోన్లతో ఆమెను ఫోటోలు తీయసాగారు. ఈలోగా కొందరు డోర్ తెరిచి, ఆమెను బయటకు లాగే ప్రయత్నం చేశారు. అశ్వని గట్టిగా ప్రతిఘటించి, కారును ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియోను అశ్వని పోస్ట్ చేస్తూ “నాకు ఎదురైన అనుభవం ఇది… వారంతా వచ్చి నా కారుమీద పడ్డారు” అని కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News