Saturday, December 21, 2024

మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి

- Advertisement -
- Advertisement -

Big boss contest divi plant tree

 

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో  బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా దివి మాట్లాడారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమని కొనియాడారు. పొల్యూషన్ ని అరికట్టాలంటే మొక్కలు ఎంతగానో అవసరం అని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటాలి అని పిలుపునిచ్చారు. మొక్కలన్న, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమని ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని దివి అన్నారు.  అనంతరం డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ మంజుల, ఆర్జె సునీత, ముగ్గురికి దివి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News