Monday, December 23, 2024

బిగ్‌బాస్‌ విన్నర్‌ బిందు మాధవి!

- Advertisement -
- Advertisement -

 

Big Bosss winner Bindu Madhavi

హైదరాబాద్: ‘బిగ్‌బాస్‌’ ఓటీటీ షోలో బిందు మాధవి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన గ్రాండ్‌ ఫైనల్ ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను విజేతగా ప్రకటించారు. బిందుకి గట్టి పోటీ ఇచ్చిన అఖిల్‌ రన్నర్‌గా నిలిచారు. మస్తీ హ్యాష్‌ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి ఆడపులి అనే హ్యాష్‌ట్యాగ్‌తో విన్నర్‌గా బయటికెళ్లారు బిందు. విజేతగా ఆమె రూ.40 లక్షలు ప్రైజ్‌ మనీ అందుకున్నారు. నిజానికి ఆమెకు ప్రైజ్‌ మనీ రూ. 50 లక్షలు దక్కాలి. ఆరియానా ముందుగానే హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆమెకు అందిన రూ.10 లక్షలను అసలు ప్రైజ్‌మనీలో తగ్గించారు. విన్నర్‌ అయిన బిందు మాధవి వేదికపై భావోద్వేగానికి లోనయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News