Monday, December 23, 2024

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అమితాబచ్చన్ మనవరాలు ఆరాధ్య!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమితాబచ్చన్ మనవరాలు ఆరాధ్య బచ్చన్(11) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యం గురించి ‘యూట్యూబ్’లో బూటకపు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆమె కోర్టుకు తెలిపింది. మైనర్ బాలికనైన తనపై మీడియా తప్పుడుగా వార్తలు రాయడంపై ‘ఇంజెక్షన్’ ఇవ్వాలని ఆమె కోరింది. ఆమె ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల కూతురు. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌ను విచారించనున్నది. ఆరాధ్య తన పిటిషన్ ద్వారా 10 సంస్థలకు చెందిన వీడియోలను డీయాక్టివేట్ చేయాలని, డీలిస్ట్ చేయాలని కోరింది. ఆమె తన కేసులో గూగుల్ ఎల్‌ఎల్‌సి, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ (గ్రీవెన్స్ సెల్)లను ఈ కేసులో వ్యతిరేక పక్షాలుగా చేర్చించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News