Thursday, January 23, 2025

బిగ్‘సి’ 20వ వార్షికోత్సవ ఆఫర్ తొలి లక్కీడ్రా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బిగ్‘సి’ 20వ వార్షికోత్సవం తొలి లక్కీడ్రా విజేతలను ప్రకటించింది. ఈ లక్కీడ్రా ఆఫర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని నెం.1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’ వ్యవస్థాపకుడు, సిఎండి ఎం.బాలు తెలిపారు. ఈ ఆఫర్‌లో మొత్తం 3 లక్కీడ్రాలను తీయగా, విజేతలుగా ఎంపికైన కస్టమర్లకు 20 మారుతీ సుజుకీ ఆల్టో కార్లు, 20 బజాజ్ ప్లాటినా బైక్‌లు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ ఆఫర్ 2023 జనవరి 29 వరకు కొనసాగుతుందని, శుక్రవారం మొదటి లక్కీడ్రా తీసి 6 మారుతీ ఆల్టో కార్లు, 6 బజాజ్ ప్లాటినా బైక్‌లు, 6 రిఫ్రిజిరేటర్లు, 6 ఏసీలు, 6 టీవీలు మొత్తం 30 విజేతలను ప్రకటించారు. వీటితో పాటు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై బహుమతి, రూ3 వేల వరకు తక్షణ డిస్కౌంట్, సులభ వాయిదాల పద్ధతి కూడా అందిస్తున్నామని తెలిపారు. బ్రాండెడ్ యాక్సెసరీస్‌పై 51 శాతం డిస్కౌంట్, ఐఫోన్ మొబైల్స్ కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్, ఇంకా సామ్‌సంగ్, వివో, ఎంఐ, ఒప్పొ, రియల్‌మి మొబైళ్ల కొనుగోళ్లపై కూడా క్యాష్ బ్యాక్‌ను సంస్థ అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News