Saturday, April 5, 2025

బిగ్‘సి’లో దీపావళి ధమాకా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో 251కి పైగా స్టోర్లను కల్గివున్న మొబైల్ రిటైల్ చైన్ బిగ్‘సి’ దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధమాకా ఆఫర్లను అందిస్తోంది. బిగ్‘సి’ ఫౌండర్, సిఎండి ఎం.బాలు ఈ ఆఫర్ల వివరాలను ప్రకటించారు. ధమాకా ఆఫర్లలో ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్‌తో పాటు రూ.4000 వరకు విలువగల బహుమతి అందిస్తోంది. దీంతో పాటు స్మార్ట్ వాచ్ ఆఫర్, లాయల్టీ పాయింట్లు ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్, 1+ 1 ఎక్స్‌టెండెడ్ వారెంటీ వంటి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

దీంతో పాటు బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్స్ కొనుగోలుపై రూ.9 వేల వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ప్రతి మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్‌బిఐ ద్వారా రూ.3 వేల వరకు డిస్కౌంట్, ఐడిఎఫ్‌సి ద్వారా 4500 వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా చాలా ఆఫర్లను బిగ్ సి అందిస్తోంది. ఎటిఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్ టాప్, ఎయిర్ కండీషనర్‌లు కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్టు ఎం.బాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News