Thursday, January 23, 2025

వేసవిలో విద్యుత్ శాఖకు భారీఆదాయం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ విద్యుత్ డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. ఈ వేసవి కాలం మాత్రం విద్యుత్ శాఖకు భారీగానే ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఎండ వేడిమిని తట్టుకోలేని వినియోగదారులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసిలను నిరంతరం వాడడం ద్వారా విద్యుత్ శాఖకు కలిసి వచ్చింది. ఈ క్రమంలో విద్యుత్ వినియోగంతో బిల్లుల వసూళ్ల రూపేణా ఆ శాఖకు భారీగానే ఆదాయం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కిందటి నెల మే మాసంలో విద్యుత్ డిమాండ్ 78 మిలియన్ యూనిట్లకు చేరగా… గ్రేటర్ హైదరాబాద్ జోన్ 9 సర్కిళ్లలో కిందటి నెల మేలో రూ. 1015 కోట్ల విలువైన విద్యుత్ బిల్లులు పంపిణీ చేయగా.. వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల రూపేణా రూ. 921 కోట్లు వసూళ్లయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నారు. విద్యుత్ డిమాండ్‌తో పాటు ఏటా కొత్తగా 2 లక్షలకు పైగానే కొత్త విద్యుత్ కనెక్షన్లు కూడా పెరుగుతున్నాయి . కాగా మే నెలలో ఎండలతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News