Monday, December 23, 2024

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్ కు భారీ నజరానా

- Advertisement -
- Advertisement -

Big prize for boxer Nikhat Zareen and shooter Isha Singh

హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు, ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కు, జర్మనీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ లకు ఒక్కొక్కరికి రూ 2 కోట్ల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News