టాలీవుడ్ నటి నభా నటేష్ ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తను గతేడాది ఓ ప్రమాదానికి గురైనట్లు తెలిపింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ సక్సెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే గత ఏడాది కాలంగా ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. దీంతో నభాకు ఏమైందని నెట్టింట చర్చ జరిగింది. తాజాగా ఈ విషయంపై సదరు నటి స్పందించింది. తను సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి ఓ పెద్ద కారణమే ఉందని స్పష్టం చేసింది. తనకు ఓ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.
గత సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. నాకు ప్రమాదం జరిగిందని. ఈ ప్రమాదంలో నా ఎడమ భుజం భాగంలో ఉన్న ఎముకలు విరిగాయని. ఈ నేపథ్యంలో పలు సార్లు సంక్షిష్టమైన సర్జరీలు చేశారని రాసుకొచ్చారు. నేను ఊహించలేని, శారీరక, మానసిక బాధను అనుభవించానని, గాయాల నుంచి కోలుకునేందుకు నాకెంతో ఇష్టమైన సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా అని ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించి సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది. ఇందుకోసం శారీరకంగా, మానసికంగా కసరత్తులు చేస్తోంది. నభా చివరిగా నితిన్‌తో కలిసి మ్యాస్ట్రో అనే సినిమా చేసింది.