Thursday, December 26, 2024

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

లైంగిక వేధింపుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన బెయిల్‌కు ఎలాంటి షరతులు కూడా విధించలేదు. దీంతో జానీ మాస్టర్‌కు ఊరట లభించినట్లయింది. ఇప్పటికే జానీ మాస్టర్‌పై కేసు, మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆయన తల్లి నెల్లూరులో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అలాగే ఆయన భార్య కూడా తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పదే పదే చెప్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News