Wednesday, January 22, 2025

స్మితా సబర్వాల్ కు హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్మితా సబర్వాల్ పై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. స్మితా సబర్వాల్ ఐఎఎస్ సెలక్షన్స్‌పై దివ్యాంగుల విషయంలో చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆమె దివ్యాంగులు ఐఏఎస్‌ను ఎంపిక చేయడం ఎందుకని ఎక్స్‌లో ప్రశ్నించారు. అత్యవసర పనుల్లో వారు విధుల్లో పాల్గొనలేరని స్మితా సబర్వాల్ అన్నారు. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దివ్యాంగులను మానసికంగా దెబ్బతీస్తుందా చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో కోరారు. స్మితా సబర్వాల్ పై వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెకు భారీ ఊరట దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News