గతేడాది టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. ఇందులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సినీ నటి హేమ న్యాయవాది కోర్టులో హేమ ఎలాంటి నిషేదిత డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లేవని వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల వాదన విన్న కోర్టు ఈ కేసుపై మధ్యంతర స్టే విధించింది.
సుమారు నాలుగు వారాలు ఈ స్టే కొనసాగనుంది. ఇప్పటికే హేమ తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పలుమార్లు స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నాలు కూడా చేసింది. అలాగే ఈ కేసు వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిషేధం విధిస్తూ.. ‘మా’ నిర్ణయం తీసుకుంది. హేమ విచారణలో నిజంగా తప్పు చేసినట్లు తెలిస్తే ‘మా’ ఆమెను బ్యాన్ చేస్తుందని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించి, ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించారు. తర్వాత ఆమెపై ‘మా’ నిషేధం ఎత్తివేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.