Friday, February 7, 2025

ముడా స్కామ్ లో సిఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్..

- Advertisement -
- Advertisement -

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సీబీఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ RTI కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది.

లోకాయుక్త దర్యాప్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పట్ల పక్షపాతంతో ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తు పక్షపాతంతో కూడినదని లేదా లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలనేలా ఆధారాలు లేవని.. ఈ పిటిషన్ ను జస్టిస్ నాగప్రసన్న కొట్టివేశారు. కోర్టు తీర్పుతో తన భార్య పార్వతికి MUDA ప్రత్యామ్నాయ స్థలాలుగా మంజూరు చేసిన భూమిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు ఊరట లభించింది. అయితే, ఈ కేసులో పిటిషనర్ స్నేహమయీ కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News