మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్‌ఎం సి చట్టం1955 ద్వారా సెక్షన్ 374బిని సృష్టించి చ ట్టబద్దత కల్పించిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో జీహెచ్‌ఎంసికి ఉన్న అధికారాలను హైడ్రా కు బదలాయిస్తూ జీఓ నెం. 191(16.10. 2024) ను విడుదల చేసింది. వాస్తవానికి జీఓ నెం. 99 (19.07.2024) ద్వారా హైడ్రా పరిధిని ఔటర్ రిం గ్ రోడ్ లోపలి వైపున విస్తరిత ప్రాంతంగా ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, జీహెచ్‌ఎంసి చట్టం ద్వారా సం క్రమిస్తున్న చట్టబద్దత వల్ల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణను జీహెచ్‌ఎంసి పరిధి వరకే పరిమితం చేస్తూ ప్ర భుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనా ర్హం. జీహెచ్‌ఎంసి పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు.. రో డ్లు, పార్కులు, చెరువులు(నీటివనరులు), నాలాలు, వీధులు, ఖాళీ ప్రదేశాలు వంటి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణను హైడ్రా చేపట్టనున్నది.
గ్రేటర్ పరిధిలో ఆక్రమణలపై చర్యలు చేపట్టే అధికారాన్ని హైడ్రాకు ప్ర భుత్వం అప్పగించింది.జీహెచ్‌ఎంసి విస్తరిత ప్రాం తం 650 చ.కి.మీ.లుగా ఉన్నది. జీఓ నెం. 99 ప్రకారంగా హైడ్రా విస్తరిత ప్రాంతం ఓఆర్‌ఆర్ (2050 చ.కి.మీ.లు) వరకు ఉన్నది. అయితే, జీహెచ్‌ఎంసి చట్టం1955కి ఆర్డినెన్స్ నెం.4, 2024 ద్వారా చట్టబద్దత వచ్చిన నేపథ్యంలో ఆ చట్టం జీహెచ్‌ఎంసి పరి ధి వరకు మాత్రమే అమలులో ఉంటున్నందున ఈ గ్రేటర్ విస్తీర్ణంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు అధికారాలను హైడ్రా కలిగి ఉంటుంది. ఇక ముందు ఈ అధికారాలతో గ్రేటర్ పరిధిలోని అక్రమనిర్మాణాలను, ఆక్రమణలపై హైడ్రా కొరఢా ఝలిపించడం ఖాయమనేది వెల్లడవుతోంది. సువిశాలమైనది, రోజురోజుకు విస్తరిస్తున్నది. పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆదరణకు నోచుకోక, పర్యవేక్షణలేక, పరిరక్షణ చూడలేకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలతో దుర్లభంగా మారుతున్నాయని ప్రభుత్వం భావించింది.
ఈ ఆస్తులు చాలా వరకు నగర పరిసరాలకు ఊపిరితిత్తుల ప్రదేశాలుగా ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేవిగా పనిచేస్తాయని ప్రభుత్వ యోచన. భవిష్యత్తులో వినోదం, సమాజ అవసరాలకు ఈ ప్రభుత్వం ఆస్తులు ఎంతో ఉపయోగపడతాయనీ, కాలుష్యాలను తగ్గించేందుకు వాతావరణ మార్పు ప్రభావాలను నియంత్రించేందుకు నీటి వనరులు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు వంటి ప్రభుత్వ ఆస్తులు చాలా అవసరం కాబట్టి ఈ ప్రజా ఆస్తుల రక్షణకు ఎక్కువ ప్రాముఖ్యతనివవాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ విలువైన ఆస్తులను సరైన శ్రద్ధతో, స్థిరమైన నిఘాతో రక్షించాల్సిన అవసరమైన నేపథ్యంలో హైడ్రా వంటి ప్రత్యేక ఏజెన్సీ ద్వారానే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావించి హైడ్రాకు జీహెచ్‌ఎంసి అధికారాలను బదిలీ చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఇకపై హైడ్రా నోటీసులు సంస్థకు పెరిగిన బలం: రంగనాథ్
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్థుల్లోకి వచ్చే అక్రమనిర్మాణాలు, అనధికారిక కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టనున్నదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నగరంలోని అనధికారిక భవనాల కూల్చివేతలపై అధికారం హైడ్రాకు లభించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాకు జీహెచ్‌ఎంసి చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులపై కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. జీహెచ్‌ఎంసి చట్టసవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు సంక్రమించాయని, ప్రభుత్వ ఉత్తర్వులతో హైడ్రా అధికారికంగా మరింత బలోపేతమైందని రంగనాథ్ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని జీహెచ్‌ఎంసి చట్టం ప్రకారం, ఓఆర్‌ఆర్ పరిధిలోని 27 మునిసిపాలిటీలకు చట్టం ప్రకారం హైడ్రా బాధ్యతలను నిర్వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.