Thursday, February 13, 2025

మంచు మోహన్ బాబుకు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై దాడి చేసిన కేసులో మంచు మోహన్ బాబుకు భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్‌లో ఆయన నివాసం వద్ద వివాదం చెలరేగింది. చిన్న కుమారుడు మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. గేట్లు తోసుకొని లోనికి చొచ్చుకెళ్లారు. ఆయనతో పాటు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. మీడియా ప్రతినిధులు వెళ్తున్న టైంలోనే అటు నుంచి మోహన్ బాబు రావడం చూశారు. ఆయన వద్దకు చేరుకున్న ఓ మీడియా ప్రతినిధి వివాదంపై ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. దీంతో తీవ్ర ఆగ్రహం ఊగిపోయిన మోహన్‌బాబు మైకు లాక్కొని దాడి చేశారు. బూతులతో విరుచుకుపడ్డారు. మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడిన ఆ మీడియా ప్రతినిధి కేసు పెట్టారు.

విధుల్లో ఉన్న తనపై చేయి చేసుకొని గాయపరిచారని హత్యాయత్నం కింద కేసు పెట్టారు. ఈ కేసులో పలు మార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన మోహన్ బాబు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. చివరకు అక్కడ ముందస్తు బెయిల్ లభించింది. దాడి చేసిన మోహన్ బాబు మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు మీడియాపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇస్తూ లెటర్స్, వీడియోలు, ఆడియో విడుదల చేశారు. వివాదం మరింత ముదిరిపోవడంతో మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఒక రోజు సడెన్‌గా తాను చేసిన దాడిలో గాయపడిన మీడియా ప్రతి నిధిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రిలో రిపోర్టర్‌ను పరామర్శించిన మోహన్ బాబు తాను చేసిన దానికి చింతిస్తున్నట్టు చెప్పారు. ఏ సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

రిపోర్టర్ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. కుటుంబంలో జరిగిన వివాదంతోనే ఇలాంటివి జరిగాయని గ్రహించిన పోలీసులు మంచు ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు. రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి టైంలో కూడా తిరుపతిలో మళ్లీ గొడవలు చెలరేగాయి. అక్కడ కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు జోక్యంత అవి సద్దుమణిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News