Monday, December 23, 2024

వైఎస్ జగన్‌కు ఎపి హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

వైసిపి అధినేత జగన్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్‌పోర్టు విషయంలో విజయవాడ కోర్టు ఆదేశాలను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మూడో తేదీన కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉన్నప్ప టికీ పాస్‌పోర్టు వివాదంతో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఏడో తేదీన వెళ్తారని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యం కాలేదు. 2019లో సిఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులు డిప్లొమాట్ పాస్ పోర్టును అదించారు. ఆ పాస్ పోర్టు మీద ఐదేళ్లు విదేశాలకు వెళ్లి వచ్చా రు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పదవిని కోల్పోయారు.

దీంతో డిప్లొమాట్ పాస్ పోర్టు ఆటోమేటిక్ రద్దైపోయింది. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ తన పాత పాస్ పోర్టుపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఈ పాస్‌పోర్టు విషయంలో విజయవాడ కోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం మంత్రి వేసిన పరువునష్టం కేసులో ఆయన పాస్‌పోర్టు సహా ఇతర అంశాలపై ఆంక్షలు పెట్టింది. కేవలం ఒక ఏడాది మాత్రమే పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలని చెప్పింది. దీంతో సమస్యలు వస్తాయని గ్రహించిన జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లకు పాస్ పోర్టు రెన్యూవల్ చేసేలా అధికారులను ఆదేశించాలని అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News