- Advertisement -
విండీస్ క్రికెట్ బోర్డు
అంటిగువా : తమ జట్టులో విభేదాలున్నట్టు వస్తున్న వార్తల ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఖండించింది. ప్రస్తుతం జట్టులో అందరు కలిసి కట్టుగా ఉన్నారని, ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో కొందరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బోర్డు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. జట్టులో విభేదాలు ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో అసలు విజయా లే దక్కేవి కావని వారు పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ సమష్టి గా జట్టు విజయం కోసం పోరాడుతున్నారని బోర్డు అధికారులు వెల్లడించారు. మరోవైపు కెప్టెన్ పొలార్డ్‌పై కొంత మంది క్రికెటర్లు అసంతృప్తి ఉన్నారని వస్తున్న వార్తల్లో పసలేదన్నారు. కెప్టెన్‌పై ఎవరికీ అసమ్మతి లేదని, ఆ విషయంలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని బోర్డు తేల్చి చెప్పింది.
- Advertisement -