Tuesday, April 29, 2025

తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : పెనుబల్లి మండల కేంద్రంలో స్థానిక హెచ్‌పి గోడౌన్ సమీపంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించగా సమీపంలోని తాటి చెట్లు, వరి గడ్డి వాములు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు మోటార్ల సహాయంతో అగ్ని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

అత్యంత సమీపంలోనే హెచ్‌పి గోడౌన్ ఉండటంతో గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఏం జరుగుతోందోననే భయం గుప్పెట్లో ప్రజలు బ్రతికారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి అదుపులోకి తెచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News