Monday, December 23, 2024

తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఆటో స్టాండ్ వద్ద నేలకొరిగిన వృక్షం

వెల్దుర్తి: వెల్దుర్తి మండల కేంద్రంలోని మెదక్ నర్సాపూర్‌కు వెళ్లి ఆటో స్టాండ్ వద్ద గత రెండు రోజుల నుంచి కురుస్తున్న మోస్తారు వర్షానికి వృక్షం నేలకొరిగిన సంఘటనలో ఎటువంటి పెను ప్రమాదం సంభవించలేదు. వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరు ప్రక్కల హరితహారంలో భాగంగా మొక్కలను గత ఐదు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు వేపుగా పెరగడంతో మెదక్ వెళ్లే ఆటో స్టాండ్ వద్ద స్థానిక మెడికల్ దుకాణం ముందు ఏపుగా పెరిగిన వృక్షం గత రెండు రోజుల నుంచి మోస్తారు వర్షానికి తడిసి నేలకు ఒరగడంతో రహదారి గుండా ఆటోలు గానీ వాహనదారులు ప్రయాణీకులు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని పరిసర ప్రాంత ప్రజలు తెలిపారు.

మంగళవారం సాయంత్రం సమయంలో మోస్తారు వర్షానికి నెలకొరిగిన వృక్షాన్ని స్పందించిన స్థానిక సర్పంచ్ అముద భాగ్యమ్మ అంజనేయులు శ్రీసాయి బిన్నిరైస్ మిల్ యజమానులు జెసిబి సాయంతో రహదారికి అడ్డంగా పడి ఉన్న వృక్షాన్ని వెంటనే తొలగించి రహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రాణులకు ఎటువంటి అటంకాలు కలగకుండా చర్యలు చేపట్టారు. కొద్దిపాటి వర్షానికి వృక్షాలను పరిశీలించి కొద్దిపాటి వర్షానికి పడిపోతున్నటువంటి వృక్షాలను తొలగించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు. వృక్షం నెలకొరిగినటువంటి సమయంలో అటుగా ప్రయాణికులు ఆటోలు రాకపోవడంతో వేణు ప్రమాదం తప్పిందని ఇటువంటి ప్రమాదాలు జరగకముందే ముందస్తుగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నామని ప్రయాణీకులు వాహనదారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News