Sunday, January 19, 2025

పెద్ద స్కామ్ ధన్వంతరి… మాకు న్యాయం చేయాలి: బాధితుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరమ్ ఆందోళన చేపట్టింది. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని బ్రాహ్మణులను మోసం చేసిన ధన్వంతరి సంస్థ ఎండీ కమలాకర్ శర్మను కఠినంగా శిక్షించాలని ఫోరమ్ కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. జనవరి 15 లోగా బాధితులకు చెల్లించిన డబ్బులు ఇవ్వకపోతే సిసిఎస్ ను ముట్టడించడంతో పాటు కమలాకర్ శర్మపై దాడి చేస్తామని హెచ్చరించారు. వాయిదాల పేరుతో కోర్టులలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు మండిపడ్డారు. పోలీసు అధికారులతో ఎండి కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ధన్వంతరి సంస్థ మోసం చేసిన వారిలో 3 వేల మంది బాధితులు ఉన్నారని, దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు.  అగ్రిగోల్డ్ కుంభకోణం కన్నా ఉమ్మడి రాష్ర్టంలో ధన్వంతరి  పెద్ద కుంభకోణం అని తెలియజేశారు. ఈ ఫౌండేషన్ లో  ఐఎస్ఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లను డైరెక్టర్లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ధన్వంతరీ పౌండేషన్ ని మూసివేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఎండి కమలాకర్ రకరకాలుగా మోసాలు చేశారని, పలు కేసులకు అనుమతి ఇవ్వాలని వాళ్లు కోరారు. లేడీ డైరెక్టర్ల బెయిల్ రద్దు చేయడమే కాకుండా సిసిఎస్ నుండి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, లేనిచో జనవరి 15న కమలాకర్ శర్మను రోడ్డు మీదకు లాక్కొచ్చి భౌతిక దాడులకు దిగుతామని బాధితులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News