Wednesday, April 16, 2025

గ్రూప్‌-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 పై సిబిఐ విచారణ జరిపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని అన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేర్ హాల్ టికెట్స్ ఎందుకిచ్చారు అని అడిగారు. కోఠి కళాశాల 18, 19వ సెంటర్ల 1490 మంది పరీక్ష రాస్తే 74 మంది ఎంపిక అయ్యారు అని తెలిపారు. 25 సెంటర్లలో 10 వేల మంది రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని అన్నారు. 654 మందికి ఒకే విధంగా మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

ఉర్దూలో రాసిన 9 మందిలో ఏడుగురు ఎంపికయ్యారని.. టాప్ 100లో ఉర్దూ మీడియం వారు ముగ్గురు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నేత రాములునాయక్ కోడలికి ఎస్టి నెం.1 ర్యాంకు వచ్చిందని ఆమె కూడా కోఠి కళాశాలలో రాశారని పేర్కొన్నారు. ఎనిమిది వేలమంది తెలుగులో రాస్తే 60 మందే ఎంపికయ్యారని.. టాప్ 100 మాత్రం నలుగురే ఉన్నారని తెలిపారు. పూజిత రెడ్డి అనే అభ్యర్థి రీకౌంటింగ్‌కు వెళ్తే 60 మార్కులు తగ్గించారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకైతే పరీక్షలు రద్దు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో లీకైతే ఎందుకు రద్దు చేయరు అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News