Friday, September 27, 2024

మూసీ సుందరీకరణతో కుంభకోణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపణలు చేశారు. ఎస్టీపీల్లో శుద్ధ చేసిన నీరు మూసీలోకి వెళ్తోందని, మళ్లీ ఆ నీటిని శుద్ధి చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ను మురుగు నీటి రహిత నగరంగా తీర్చిదిద్డాలనే లక్ష్యంతో మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించామన్నారు. రూ.3866 కోట్ల రూపాయలతో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని కెటిఆర్ వివరించారు.

ఫతేనగర్ లో ఎస్ టిపి ని సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కెటిఆర్ పరిశీలించారు. ఎస్ టిపి నిర్మాణాలపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం 31 ఎస్ టిపిల నిర్మాణం చేపట్టామని తెలియజేవారు. కొన్ని చివర దశలో ఉన్నాయని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీ కరణ పేరుతో వేలు, లక్షల కోట్లు ఖర్చు చేయాలని ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని కెటిఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేద్దలకు ఒక న్యాయం పేదలకు మరో న్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News