Sunday, January 19, 2025

సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో పంపిన సమన్లను పదేపదే బేఖాతరు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేస్తూ మెజిస్టీరియల్ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) చేసిన ఫిర్యాదుపై విచారణ ప్రక్రియను నిలిపివేయడానికి శుక్రవారం ఢిల్లీలోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మెజిస్టీరియల్ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాకేష్ శ్యాల్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆదేశించారు. మార్చి 16న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్ర జారీచేసిన ఉత్తర్వుపై స్టే కోరుతూ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News