Monday, December 23, 2024

తుక్కుగూడ మున్సిపాలిటీలో బిజెపికి బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రస్థానంలో దూసుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు ఆకర్షితులు అయి అనేక మంది బిఆర్ఎస్ లో చేరటానికి ముందుకు వస్తున్నారని అన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు, వెంకట్ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ పెంటమ్మ, మాజీ వార్డు మెంబెర్స్, నాయకులతో కలిసి 200 మంది బిజెపి రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి బి ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు.

నియోజకవర్గము ఒక కుటుంబంలాగా భావించి, అభివృద్ధి ద్వేయంగా ముందుకేళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తుక్కుగుడా మునిసిపాలిటీ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రోడ్లు విస్తరణతో పాటు మునిసిపాలిటీ లో కనీస సౌకర్యాల కల్పన కు పెద్ద పీట వేస్తున్నామని సబితా చెప్పారు. నియోజకవర్గ మధ్యలో ఉన్నందున డిసిపి ఆఫీస్ తో పాటు, విద్యుత్ శాఖ ఎడి కార్యాలయం తుక్కుగూడ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.లయన్స్ క్లబ్ వారు ప్రతిపాదించిన100 పడకల ఆస్పత్రి తో పాటు పాలిటెక్నిక్ కళాశాల ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు సబితా తెలిపారు. స్వంత జాగా ఉన్న వారికి ఇళ్ళు కట్టుకోవాటానికి 3 లక్షల ప్రభుత్వ సహాయం త్వరలో అందిస్తుందన్నారు.  అనునిత్యం రైతుల గురుంచి ఆలోచించే ముఖ్యమంత్రి కెసిఆర్ లాంటి వారిని ఎన్నడూ చూడలేదని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ, రైతు బంధు, రైతు భీమా పథకాలు, నీళ్లు, గిట్టుబాటు ధర, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇలా అన్ని రంగాల గురుంచి ఆలోచిస్తూ పనిచేస్తున్నారని కొనియాడారు.

తుక్కుగుడాలో 52 కంపెనీలు ఏర్పాటు అయ్యాయని, ఇందులో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్, వీధి దీపాల కోసం 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మునిసిపాలిటీ పరిధిలోని మంఖాల్, సర్దార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ లలో 280 వరకు మనకు వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ మంఖాల్,సర్దార్ నగర్,రావీర్యాల, ఇమామ్ గూడ,తుక్కుగుడా పేద ప్రజలకు,అర్హులకు కేటాయిస్తారని,ఇంకా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకోకుంటే వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని, అనంతరం విచారణ చేసి ఇళ్ళు లేని వారికి పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మీ అందరి సహకారంతో తాను ఎమ్మెల్యే గా గెలిచానని, ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రిగా అవకాశం కల్పించి మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News