Monday, January 20, 2025

బిఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతిలే ని బిఆర్‌ఎస్ కార్యాలయ భవనాలను పక్షం రోజుల్లో కూల్చివేయాలని హై కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కట్టకముందే పర్మిషన్ తీసుకోవాలని, నిర్మాణం చేసిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్ర శ్నించి కూల్చివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా లక్షరూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బిఆర్‌ఎస్ పార్టీని హైకోర్టు
ఆదేశించింది. దీంతో బిఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది.

సుప్రీంను ఆశ్రయిస్తాం : మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని నల్లగొండ మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఇచ్చిన ఆదేశంపై అప్పీల్‌కు వెళతామంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భవనాలను కూల్చుతుంటే చూస్తూ ఊరుకోమని, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్సష్టం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి కూడా అనుమతులు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కూల్చడమే పనిగా పెట్టుకుందని, కూల్చడం కాదు.. నిలబెట్టడం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు.

అంతర్మథనంలో గులాబీ నేతలు
ఇదిలావుండగా, నల్లగొండ బిఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణంపై గత రెండునెలలుగా చర్చ జరుగుతోంది.. మంత్రి కోమటిరెడ్డి ఆ కార్యాలయ భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తూ వచ్చారు. బిఆర్‌ఎస్ నేతలు పార్టీ కార్యాలయ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలకో న్యాయం.. పార్టీ కార్యాలయానికి ఓ న్యాయమా.. సామాన్యుడు ఇలా చేస్తే వెంటనే కూలగొడతారు.. ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మంత్రి అధికారులపై మండిపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో బిఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పూర్తిస్థాయిలో విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతి లేకుండా కట్టన

బిఆర్‌ఎస్ కార్యాలయ భవనాలను 15 రోజుల్లోగా కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారు? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కట్టకముందే పర్మిషన్ తీసుకోవాలి.. నిర్మాణం చేసిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. అంతేకాకుండా లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బిఆర్‌ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. భవనాలను కూల్చివేయాలని ఆదేశించడంతో మాజీ సిఎం కెసిఆర్, గులాబీ పార్టీకి ఎదురుదెబ్బ తగినట్లుగానే చెప్పాలి. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు పోవాలని ఆ పార్టీ నేతలు మదనపడిపోతున్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్ళాలా? వెళ్ళినా ప్రయోజనం ఉంటుందా? ఏంచేయాలి? ఎలాచేయాలి? అని ఆలోచన చేస్తున్నారు. ఏదిఏమైనా బిఆర్‌ఎస్ ఆఫీస్ భవనాల నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించడంతో ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News