Thursday, January 23, 2025

కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్స్ నిర్ణయంపై ఆగ్ర హం వ్యక్తం చేసిన టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజు లో ఐసిసి కోత విధించింది. అంతే కాకుండా ఆమెపై నిషేధం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడో వన్డేలో భారత్ సులభంగా గెలిచేలా కనిపించింది. విజయానికి చేరువ అవుతోన్న సమయంలో చివరి ఆరు వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో వన్డే మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ వన్డే లో టీమిండియా ప్లేయర్స్ ఔట్ విషయంలో అంపైర్స్ వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నారు.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఔట్ విషయంలో బంగ్లా ప్లేయర్స్ అప్పీల్ చేయడానికంటే ముందే అంపైర్ ఆమెను ఔట్‌గా ప్రకటించడం ఏంటని వారు మండిపడుతున్నారు. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన హర్మన్ ప్రీత్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొ ట్టింది. ట్రోఫీ ప్రజెంటేషన్ టైమ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఫొటో సెషన్ సమయంలో మీతో పాటు అంపైర్స్‌ను కూడా తెచ్చుకుంటే బాగుండేదంటూ బంగ్లా క్రికెటర్లపై హర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆగ్రహించిన ఐసిసి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడినట్లు సమాచారం.ఫైన్‌తో పాటు ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News