Monday, December 23, 2024

మాజీ ఎంఎల్ఎ షకీల్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

బోదన్ ఎమ్మెల్యే షకీల్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి17, 2022న జూబ్లీహిల్స్, రోడ్డునంబర్ 45లో కొందరు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వారికి ఢీకొట్టింది. దీంతో రెండేళ్ల బాలుడిపై కారు దూసుకు వెళ్లడంతో మృతిచెందాడు. అప్పుట్లో బాలుడిని ఢీకొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండేళ్ల చిన్నారి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించిన తర్వాత బెదిరించి వారిని వారి స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు తరలించారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. అయినా కూడా ఆ కారు తనది కాదని స్టిక్కర్ తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. హిట్ రన్ కేసులో కారును డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై కాకుండా మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జ్‌షీట్ వేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసు బయటికి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News