Friday, December 20, 2024

గ్రేటర్ బిజెపికి బిగ్ షాక్….

- Advertisement -
- Advertisement -

బలమైన బిసి నేత పల్లపు గోవర్ధన్ రాజీనామా
నేడు మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బిజెపికి దూరమవుతున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం పార్టీకి ఖైరతాబాద్ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ రాజీనామా చేశారు. పార్టీకి గత పదేళ్ల నుంచి శ్రమిస్తున్న ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ వస్తుందని భావిస్తే పార్టీ ఆయనకు మొండి చేయి చూపింది. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బిసి నేత కావడంతో బిఆర్‌ఎస్‌లోకి సాదరంగా మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు ఆహ్వానించారు. నేడు భారీ ర్యాలీతో తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో చేరనున్నారు. గులాబీలో గోవర్ధన్ చేరికతో ఖైరతాబాద్ బిజెపి సగం ఖాళీ అవుతుంది. ఈ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోరుంది.
గోవర్ధన్ వెంట యువజన సంఘాలు, వడ్డెర, ఉప్పెర ఇతర బిసి నేతలు పెద్ద సంఖ్యలో చేరునున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా పల్లపు గోవర్దన్ మాట్లాడుతూ తనకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపితో 22 ఏళ్ల అనుబంధం ఉందని పార్టీ మారినా హిందుత్వం, ధర్మం కోసం సంఘ్ స్పూర్తితో పని చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బిసి ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను పార్టీ నాయకత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పార్టీ కోసం సర్వం ధారపోసిన వారికి, బిసిలకు కనీస గౌరవం కూడా లేదని,ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఇక బిజెపిలో ఉండడం ఆత్మహత్యతో సమానమన్నారు. అగ్రకులాల చేతిలో బిజెపి బంధీ అయ్యిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News